ఎయిర్ కోస్టా హ్యాపీ అవర్స్ ఆఫర్ | air costa happy hour offer | Sakshi
Sakshi News home page

ఎయిర్ కోస్టా హ్యాపీ అవర్స్ ఆఫర్

Nov 25 2014 12:55 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఎయిర్ కోస్టా హ్యాపీ అవర్స్ ఆఫర్ - Sakshi

ఎయిర్ కోస్టా హ్యాపీ అవర్స్ ఆఫర్

విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్ కోస్టా ‘హ్యాపీ అవర్స్’...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్ కోస్టా ‘హ్యాపీ అవర్స్’ పేరుతో ఎంపిక చేసిన రూట్లలో తగ్గింపు ధరలకే టిక్కెట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కింది అన్ని పన్నులతో కలుపు కొని  రూ. 1,499 నుంచి రూ. 3,999 లకే టిక్కెట్లను అందిస్తున్నట్లు ఎయిర్ కోస్టా తెలిపింది. హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, బెంగళూరు - కోయంబత్తూర్‌లకు రూ.1,499కే అందిస్తుండగా, జైపూర్-చెన్నై, విజయవాడ-కోయంబత్తూర్‌లకు రూ.3,999కే అందిస్తున్నట్లు ఎయిర్ కోస్టా ఒక ప్రకటనలో తెలిపింది.

 నవంబర్ 24 మధ్యాహ్నం 3 గుంటల నుంచి నవంబర్ 27 మధ్యాహ్నం 3 గంటల లోపు బుక్ చేసుకున్న వారికి ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో జనవరి 15, 2015  నుంచి ఏప్రిల్ 15, 2015లోపు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఈ ఆఫర్ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటే నగదు వెనక్కి రాదని, అలాగే ప్రయాణ తేదీలను మార్చుకుంటే రూ.1,500 అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ కోస్టా సీఈవో కెప్టెన్ కె.ఎన్.బాబు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement