ముందస్తు పన్నుల్లో బ్యాం‘కింగ్‌’లు వెనుకంజ! | Advance tax mop-up rises a tepid 10% as large banks drag | Sakshi
Sakshi News home page

ముందస్తు పన్నుల్లో బ్యాం‘కింగ్‌’లు వెనుకంజ!

Dec 16 2016 1:13 AM | Updated on Sep 4 2017 10:48 PM

ముందస్తు పన్నుల్లో బ్యాం‘కింగ్‌’లు వెనుకంజ!

ముందస్తు పన్నుల్లో బ్యాం‘కింగ్‌’లు వెనుకంజ!

ముందస్తు పన్ను చెల్లింపుల విషయంలో మూడవ త్రైమాసికంలో అగ్ర బ్యాంకులు వెనకబడ్డాయి.

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ పేలవ పనితీరు  
ముంబై: ముందస్తు పన్ను చెల్లింపుల విషయంలో మూడవ త్రైమాసికంలో అగ్ర బ్యాంకులు వెనకబడ్డాయి. దీంతో అతిపెద్ద రెవెన్యూ జోన్‌గా పేరొందిన ముంబైలో అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వసూళ్ల వృద్ధి కేవలం 10%గా నమోదయింది. ఈ ప్రాంతంలోని 43 అతిపెద్ద కార్పొరేట్ల చెల్లింపులు వార్షికంగా చూస్తే, 10% వృద్ధితో రూ.24,811 కోట్ల నుంచి (గత ఏడాది ఇదే త్రైమాసికంలో) రూ.27,321 కోట్లకు పెరిగాయి.

వివిధ సంస్థలను చూస్తే...
ఎస్‌బీఐ చెల్లింపులు 25% పడిపోయి రూ.1,731 కోట్ల నుంచి రూ.1,282 కోట్లకు పడిపోయాయి.
ఐసీఐసీఐ బ్యాంక్‌ విషయంలో ఈ రేటు 27.3% క్షీణించి రూ.1,650 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు దిగింది.
ఎల్‌ఐసీ నుంచి వసూళ్లు 13% వృద్ధితో రూ.1,977 కోట్ల నుంచి రూ.2,235 కోట్లకు చేరాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చెల్లింపులు 17% వృద్ధితో రూ.1,970 కోట్ల నుంచి రూ.2,300 కోట్లకు చేరాయి. అలాగే మార్టిగేజ్‌ లెండర్‌ హెచ్‌డీఎఫ్‌సీ చెల్లింపులు రూ.810 కోట్ల నుంచి రూ.920 కోట్లకు చేరాయి.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చెల్లింపులు 10% వృద్ధితో రూ.2,600 కోట్లకు చేరాయి.
టీసీఎస్‌ చెల్లింపులు స్వల్పంగా రూ.1,600 కోట్ల నుంచి రూ.1,540 కోట్లకు దిగాయి.
యస్‌ బ్యాంక్‌ చెల్లింపులు 44% వృద్ధితో రూ.424 కోట్ల నుంచి రూ.610 కోట్లకు ఎగశాయి.
టాటా స్టీల్‌ అడ్వాన్స్‌ ట్యాక్స్‌ 11% పడిపోయి రూ.450 కోట్ల నుంచి రూ.400 కోట్లకు దిగింది.
చమురు రంగానికి వస్తే, ఐఓసీ చెల్లింపులు 140 శాతం పెరిగి రూ.1,830 కోట్లుగా ఉన్నాయి. బీపీసీఎల్‌ చెల్లింపులు 11 శాతం పెరిగి రూ.480 కోట్లకు ఎగశాయి. హెచ్‌పీసీఎల్‌ విషయంలో వృద్ధి 164 శాతంగా ఉంది. ఈసంస్థ చెల్లింపులు రూ.603 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement