51% వృద్ధి సాధించిన సూక్ష్మరుణ రంగం 

51% growth of microfinance sector - Sakshi

ఎమ్‌ఎఫ్‌ఐఎన్‌ తాజా నివేదిక  వెల్లడి  

న్యూఢిల్లీ:  సూక్ష్మరుణ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో ఈ పరిశ్రమ 51 శాతం వృద్ధి చెందిందని మైక్రో పైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ నెట్‌వర్క్‌ (ఎమ్‌ఎఫ్‌ఐఎన్‌) తాజానివేదిక పేర్కొంది. ఈ క్యూ2 నాటికి ఈ రంగం స్థూల రుణ పోర్ట్‌ఫోలియో(జీఎల్‌పీ) రూ.1,46,741 కోట్లని  ఈ నివేదిక పేర్కొంది. ఈ రుణాల్లో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు–సూక్ష్మ రుణ సంస్థల(ఎన్‌బీఎఫ్‌సీ–ఎమ్‌ఎఫ్‌ఐ) వాటా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉందని వివరించింది. సూక్ష్మరుణ రంగం సంబంధించి ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..,  

∙ఈ క్యూ2 చివరి నాటికి సూక్ష్మరుణ సంబంధిత ఖాతాల సంఖ్య 27 శాతం వృద్ధితో 7.77 కోట్లకు పెరిగాయి. దీంట్లో ఎన్‌బీఎఫ్‌సీ–ఎమ్‌ఎఫ్‌ఐ వాటా 33 శాతం వృద్ధితో 3.43 కోట్ల ఖాతాలకు ఎగసింది.  
∙ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికి మొత్తం సూక్ష్మ రుణ రంగం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీ–ఎమ్‌ఎఫ్‌ఐల వాటా 37 శాతం(రూ.54,018 కోట్లుగా) ఉంది. రెండో స్థానంలో బ్యాంక్‌లు నిలిచాయి. బ్యాంక్‌ల రుణాలు 33 శాతంగా (రూ.48,200 కోట్లు) ఉన్నాయి.  
∙మొత్తం సూక్ష్మ రుణాల్లో స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ల వాటా 17 శాతంగా, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల వాటా 12 శాతంగా ఉంది.
∙గత ఏడాది నుంచి సూక్ష్మ రుణ రంగం పోర్ట్‌ఫోలియో ఆరోగ్యకరమైన మెరుగుదలను సాధిస్తోంది. ఇది శుభసూచకం. ఇదే తీరు మరికొన్ని క్వార్టర్ల పాటు కొనసాగనున్నది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top