చండ్రుగొండ పీహెచ్‌సీకి జాతీయ అవార్డు | National Award For Chandragonda Ph.C. In Bhadradri Kothagudem | Sakshi
Sakshi News home page

చండ్రుగొండ పీహెచ్‌సీకి జాతీయ అవార్డు

Mar 8 2019 1:18 PM | Updated on Mar 8 2019 1:19 PM

National Award For Chandragonda Ph.C. In Bhadradri Kothagudem - Sakshi

 కేక్‌కట్‌ చేస్తున్న ఎంపీపీ బాలు, జెడ్పీటీసీ సభ్యులు కృష్ణారెడ్డి   

సాక్షి, చండ్రుగొండ: చండ్రుగొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. తొలుత ఎంపీపీ బాలునాయక్, జెట్పీటీసీ సభ్యులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి కేక్‌కట్‌ చేసి వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రికార్డుల నిర్వహణ, డెలివరీలు, వ్యాక్సిన్స్, పారిశుద్ధ్యం, గర్భిణుల పట్ల సిబ్బంది తీసుకున్న చొరవ ఇలా అనేక కోణాల్లో జాతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ పరిశీలించన సర్వేలో చండ్రుగొండ పీహెచ్‌సీకి జాతీయస్థాయిలో 86 మార్కులు రావడం విశేషం.  కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ సీతారాంప్రసాద్, హోమియో డాక్టర్‌ ప్రవీణకుమార్, డాక్టర్‌ భవ్య, ఎస్‌ఐ కడారి ప్రసాద్, ఎంఈఓ ఝంకీలాల్, ఉపసర్పంచ్‌ బాబురావు, నాయకులు సారేపల్లి శేఖర్, పులి సత్యం, తుమ్మలపల్లి సురేష్, డి.మల్లేష్, పకీర్‌కుమార్, కిరణ్‌రెడ్డి, బాబ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement