వారఫలాలు(జూన్‌ 21 నుంచి 27 వరకు) | Weekly Horoscope From June 21 To 27 | Sakshi
Sakshi News home page

వారఫలాలు(జూన్‌ 21 నుంచి 27 వరకు)

Jun 21 2020 6:44 AM | Updated on Jun 21 2020 6:46 AM

Weekly Horoscope From June 21 To 27 - Sakshi

మేషం...
అనుకున్న పనులు దిగ్విజయంగా కొనసాగుతాయి. యుక్తిగా వ్యవహరించి అందర్నీ ఆకట్టుకుంటారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉండి రుణాలు తీరతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత వరకూ గట్టెక్కుతారు. వ్యాపారాలలో కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. పారిశ్రామికవర్గాలకుS అనుకూల పరిస్థితులు. వారం చివరిలో అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

వృషభం...
ఇతరులకు సైతం సహాయం అందిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి సా«ధిస్తారు. ఆస్తుల విక్రయాలు పూర్తి చేసి కొంత సొమ్ము అందుకుంటారు. ముఖ్య వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. పసుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మిథునం...
ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఎంతటి పనినైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వివాహాది ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలు సఫలం. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.   వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి.  ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి  మంచి గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. సోదరులతో వివాదాలు. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం...
రెట్టించిన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. సమాజంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. వాహనయోగం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు.  నిలిచిపోయిన ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగాలలో ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విశేష గుర్తింపు. వారం మధ్యలో  శ్రమ పెరుగుతుంది. అనుకోని ధనవ్యయం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

సింహం...
కొన్ని పనులు ముందుకు సాగక డీలా పడతారు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ప్రయాణాలు చివరిలో వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఒక  కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. ఉద్యోగార్థుల యత్నాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడతాయి. కళారంగం వారికి చికాకులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో  శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి. పసుపు, ఆకుపచ్చ రంగులు.  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కన్య..
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి సహాయపడతారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. పనులు  సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రులS ద్వారా శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో తమ సేవలకు గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు  మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో బంధువులతో వివాదాలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. 

తుల...
ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. ఆర్థిక వ్యవహారాలు మరింత సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి పిలుపు అందుతుంది. కొన్ని సమస్యల నుంచి ఓర్పు, నేర్పుగా బయటపడతారు. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి.   ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో  విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

వృశ్చికం..
అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో చిక్కులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో  బంధువిరోధాలు. ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు...
చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పరిచయాలు పెరుగుతాయి.  శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వేడుకల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో అనుకోని  లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరమైన సమయం. వారం మధ్యలో  కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. 

మకరం....
కుటుంబసమస్యల నుంచి అధిగమిస్తారు.  చేపట్టిన పనులు శ్రమపడ్డా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత భరోసా ఏర్పడుతుంది. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఓర్పు, నేర్పుగా వ్యవహరించి సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. కళారంగం వారికి  ప్రయత్నాలు సఫలం.  వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కుంభం...
కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. సన్నిహితులతో కష్టసుఖాలు విచారిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. చేజారిన వస్తువులు తిరిగి దక్కుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో విధుల్లో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు. శ్రమాధిక్యం. నలుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యాష్టకం పఠించండి.

మీనం...
ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారంలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగార్ధుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలోపనిభారం నుంచి విముక్తి.  రాజకీయవర్గాలకు మంచి ఆదరణ లభిస్తుంది. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement