గ్రహం అనుగ్రహం (05-01-2020) | Daily Rasi Phalalu in Telugu (05-01-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (05-01-2020)

Jan 5 2020 6:05 AM | Updated on Jan 5 2020 6:14 AM

Daily Rasi Phalalu in Telugu (05-01-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.దశమి రా.12.23 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం అశ్వని ఉ.10.37 వరకు, తదుపరి భరణి, వర్జ్యం ఉ.6.14 నుంచి 8.01 వరకు, తిరిగి రా.8.55 నుంచి 10.36 వరకు దుర్ముహూర్తం సా.4.06 నుంచి 4.50 వరకు, అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం        :  6.36
సూర్యాస్తమయం    :  5.35
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు. 
వృషభం: .కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. బంధువులను కలుసుకుంటారు. 
మిథునం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆలయాలు సందర్శిస్తారు. శుభవార్తలు వింటారు.  ఆస్తి వివాదాలు తీరతాయి. కొత్త పనులకు శ్రీకారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి. వాహనయోగం. 
కర్కాటకం: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వేడుకలలో పాల్గొంటారు.  ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
సింహం: శ్రమాధిక్యం. పనులలో కొంత జాప్యం. ఆరోగ్యభంగం. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఇంటాబయటా బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. 
కన్య: కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు. దైవదర్శనాలు. 
తుల: నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి.  వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 
వృశ్చికం: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. సంఘంలో గౌరవం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. 
ధనుస్సు: మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సూచనలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళపరిస్థితి. ఆలయ దర్శనాలు. 
మకరం: దనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు ఉంటాయి. 
కుంభం: ఇంటాబయటా అనుకూలస్థితి. విద్యార్థులకు నూతన అవకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. 
మీనం: బంధువులతో వివాదాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. ఆర్థిక లావాదేవీలు కొంత మందగిస్తాయి. ఆరోగ్యభంగం. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొన్ని ఇబ్బందులు.
– సింహంభట్ల సుబ్బారావు 

Advertisement
 
Advertisement
Advertisement