గ్రహం అనుగ్రహం (29-10-2019) | Daily Horoscope in Telugu (29-10-2019) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (29-10-2019)

Oct 29 2019 5:43 AM | Updated on Oct 30 2019 10:51 AM

Daily Horoscope in Telugu (29-10-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.పాడ్యమి ఉ.7.42 వరకు, తదుపరి విదియ నక్షత్రం విశాఖ రా.2.10 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం ఉ.8.28 నుంచి 10.01 వరకు, దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.03 వరకు, తదుపరి రా.10.28 నుంచి 11.18 వరకు అమృతఘడియలు... సా.5.43 నుంచి 7.14 వరకు.

సూర్యోదయం :    6.01
సూర్యాస్తమయం    :  5.28
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

భవిష్యం
మేషం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వస్తు,వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం,. శుభవా ర్తా శ్రవణం. విందువినోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. దైవదర్శనాలు.
మిథునం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకు లు. దైవచింతన. వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
కర్కాటకం: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. పనుల్లో స్వల్ప అవాంతరాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. విందువినోదాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
కన్య: రుణబాధలు తప్పవు. ఆలోచనలు కలసిరావు. అనుకున్న వ్యవహారాలలో స్వ ల్ప అవాంతరాలు. దూరప్రయాణాలు. కు టుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో కొంత గందరగోళం. ఉద్యోగాలలో చికాకులు.
తుల: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. శుభవార్తలు వింటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
వృశ్చికం: సన్నిహితులు, మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో తొందరపాటు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో పనిభారం.
ధనుస్సు: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. వస్తులాభాలు. 
మకరం: నూతన ఉద్యోగాలు పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.
కుంభం: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. పనులలో ఆటంకాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
మీనం: కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి.
– సింహంభట్ల సుబ్బారావు 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement