గ్రహం అనుగ్రహం (08-12-2019)

Daily Horoscope in Telugu (08-12-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.ఏకాదశి ఉ.7.09 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం అశ్వని రా..3.04 వరకు తదుపరి భరణి, వర్జ్యం రా.10.44 నుంచి 12.25 వరకు, దుర్ముహూర్తం సా.3.55 నుంచి 4.36 వరకు, అమృతఘడియలు... రా.7.17 నుంచి 8.56 వరకు.

సూర్యోదయం        :  6.22
సూర్యాస్తమయం    :  5.22
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికర సమాచారం. విందులువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ది. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
వృషభం: మిత్రులు,బంధువులతో స్వల్ప విభేదాలు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ.
మిథునం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కర్కాటకం: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభ సూచనలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సింహం: ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కన్య: సన్నిహితులు ఒత్తిడులు పెంచుతా రు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉం టుంది. ఉద్యోగయత్నాలలో అవాంతరా లు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
తుల: కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. ముఖ్యమైన పనులలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
వృశ్చికం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
ధనుస్సు: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు వద్దు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
మకరం: నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.
కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో హోదాలు లభిస్తాయి.
మీనం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
– సింహంభట్ల సుబ్బారావు 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top