యునెటైడ్ క్లబ్‌పై మెరుపు దాడి | Yunetaid club lightning attack | Sakshi
Sakshi News home page

యునెటైడ్ క్లబ్‌పై మెరుపు దాడి

Jan 13 2015 2:21 AM | Updated on Sep 2 2017 7:36 PM

యునెటైడ్ క్లబ్‌పై మెరుపు దాడి

యునెటైడ్ క్లబ్‌పై మెరుపు దాడి

జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు సోమవారం కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ కె.రమేష్, ఎస్‌ఐ రంగనాయకులు....

క్రైం (కడప అర్బన్) : జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు సోమవారం కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ కె.రమేష్, ఎస్‌ఐ రంగనాయకులు  పోలీసు బృందం, స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి రైల్వేస్టేషన్‌రోడ్డులో  ఉన్న యునెటైడ్ క్లబ్‌పై ం మెరుపుదాడి నిర్వహించారు. అంతకుముందు ఆఫీసర్స్ క్లబ్ వద్దకు వెళ్లగా అక్కడతాళం వేసి ఉండటంతో  యునెటైడ్ క్లబ్ వద్దకు వచ్చారు. 

నిబంధనలకు విరుద్ధంగా తమ జేబుల్లో డబ్బులు పెట్టుకుని మూడు గదుల్లో ఐదు టేబుళ్లపై జూదమాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. డీఎస్పీ ఆదేశాల మేరకు జూదరులందరినీ  వాహనాల్లో ఎక్కించి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. వారి వద్ద ఉన్న రూ. 2,35,000 నగదు,  30 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ రమేష్ మీడియాతో మాట్లాడుతూ  అందిన సమాచారం మేరకు  యునెటైడ్ క్లబ్‌పై దాడులు నిర్వహించామన్నారు.
 
ఈ దాడుల్లో 30 మందిని అరెస్టు చేశామన్నారు. వారి వద్దనుంచి సెల్‌ఫోన్లు, నగదు, కాయిన్లు,  పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని స్టేషన్‌కు తరలించామని,  నేడో, రేపో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement