నేడు అగ్రిగోల్డ్‌ బాధితులకు ‘బాసట’ | Sakshi
Sakshi News home page

నేడు అగ్రిగోల్డ్‌ బాధితులకు ‘బాసట’

Published Sat, Dec 29 2018 8:34 AM

YSRCP Supports Agrigold Victims in Visakhapatnam - Sakshi

మద్దిలపాలెం(విశాఖ తూర్పు): అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్సార్‌సీపీ బాసట కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం శనివారం మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో జరగనుంది. ఈసమావేశానికి ముఖ్యఅతిథులుగా పార్టీ రాష్ట్ర ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ, అగ్రిగోల్డ్‌ బాధితులకు వైఎస్సార్‌సీపీ బాసట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పిరెడ్డి హాజరవుతున్నారని బాసటకమిటీ విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి నడింపల్లి కృష్ణంరాజు తెలిపారు. మద్దిలపాలెం నగర పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి  ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీలను రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది కన్వీనర్లతో  ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విశాఖ వేదికగా రాష్ట్ర స్థాయి సమావేశం శనివారం జరగనుందని, దీనికి తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన కమిటీల కన్వీనర్లు హాజరవుతున్నారని తెలిపారు.

ఈసమావేశంలో బాధితుల సమస్యలపై నాలుగు జిల్లాల కన్వీనర్లతో రాష్ట్రస్థాయి నాయకులు చర్చిస్తారని తెలిపారు. జనవరి 3న రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితుల «ధైర్యంగా ఉండాలని, రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  బాధ్యతలు స్వీకరించగానే అగ్రిగోల్డ్‌ నుంచి బా«ధితులకు ఇవ్వాల్సిన  ప్రతి పైసా వసూలు చేసి ఇస్తారని తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండేందుకు వారి కష్టాలను తెలుసుకునేందుకు బాసట కమిటీలు కృషి చేస్తాయని చెప్పారు. అగ్రిగోల్డ్‌ బాధితులు మనో««ధైర్య కోల్పోకుండా, ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడకుండా బాసట కమిటీల సభ్యులకు ధైర్యాన్నిచ్చేందుకు రాష్ట్ర నాయకులు సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర అదనపు కార్యదర్శులు  జి.రవిరెడ్డి, మొల్లి అప్పారావు, (తూర్పు), బాసట కమిటీ నియోజవర్గం  కన్వీనర్‌లు  దాడి సత్యనారాయణ (పశ్చిమం), పామేటి బాబ్జీ  (ఉత్తరం), పీతల వాసు (దక్షణం) తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement