గుడివాడలో నేడు భారీ బహిరంగసభ | YSRCP Public meeting in Gudivada | Sakshi
Sakshi News home page

గుడివాడలో నేడు భారీ బహిరంగసభ

May 7 2018 6:51 AM | Updated on May 7 2018 6:51 AM

YSRCP Public meeting in Gudivada - Sakshi

గుడివాడ : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో  భాగంగా సోమవారం సాయంత్రం గుడివాడ పట్టణంలోని నెహ్రూ చౌక్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. సోమవారం ఉదయం గుడ్లవల్లేరు మండలంలోని కవిరాజ నగర్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమై గుడివాడ మండలం సిద్దాంతం  మీదుగా బొమ్ములూరు చేరుకుని అనంతరం బొమ్ములూరు శివారు లారీ స్టాండ్‌ వద్ద మధ్యాహ్నం బస ఉంటుందని చెప్పారు. అక్కడ నుంచి మార్కెట్‌ యార్డు పెద్దకాలువ సెంటర్‌ మీదుగా గుడివాడ చేరుకుని గుడివాడ నెహ్రూ చౌక్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement