ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సాధించుకొనే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ ఎంపీలు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ.. విభజన హామీలను సాధించుకొనే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు లాంటి హామీలను అమలు చేయాలని పార్లమెంటులో పట్టుబడతామని తెలిపారు. అనంతరం ఎంపీలందరూ పార్లమెంటుకు కలసి వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు.