‘రాజ్యసభ సభ్యులను పంపి.. రాజీకి ప్లాన్‌’

Ysrcp Mp Vijayasaireddy Fires on TDP - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో స్పందించారు. 'లక్షల కోట్ల అవినీతి బయటపడితే జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుందన్నఆందోళనతోనే చంద్రబాబు బీజేపీతో మళ్లీ సయోధ్యకు తహతహలాడుతున్నారు. ముందుగా రాజ్యసభ సభ్యులను పంపించి రూట్‌ క్లియర్‌ చేసుకుంటున్నారు. వీళ్ల ద్వారా బీజేపీ పెద్దలతో రాజీ కుదుర్చుకుని కేసుల నుంచి బయటపడే ప్లాన్.

టీడీపీని ఓడించినందుకే కర్నూలు జిల్లాల్లో అభివృధ్ది పనులు చేపట్టలేదని 6 నెలల క్రితం చంద్రబాబు చెప్పిన విషయం అందరికీ గుర్తుంది. ఎన్నికల తర్వాత ప్రజలంతా నావారే. ఎవరి పట్ల వివక్ష ఉండదని సీఎం జగన్ గారు స్పష్టం చేశారు. మ్యానిపులేటర్ చంద్రబాబుకు, ప్రజా నాయకుడు జగన్ గారికి తేడా ఇదే' అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top