శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కె.వెంకటరమణ మంగళవారం తన నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు.
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కె.వెంకటరమణ మంగళవారం తన నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని గిరిజనుల సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు. వారి సమస్యలను సాధ్యమైనంత త్వరగా తీర్చుతానని ఆయన గిరిజనులకు హామీ ఇచ్చారు.
గతంలో తమ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరు తమ సమస్యలు పట్టించుకోలేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి...తమ సమస్యలు... తెలుసుకుని..వాటిని నెరవేరుస్తానని హామీ ఇచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్యే వెంకటరమణ అని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.