‘సమర శంఖారావాన్ని విజయవంతం చేయాలి’

YSRCP Leaders Comments Over Samara Shankaravam - Sakshi

సాక్షి, నెల్లూరు: ఈ నెల 19వ తేదీన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  చేపట్టనున్న సమర శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌ సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఎన్నికల ముందు కీలక సమావేశం కానుందని తెలిపారు. బూత్ కమిటీ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు.

అనంతరం నెల్లూరు వైఎస్సార్‌ సీపీ జిల్లా ఇంచార్జి సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఈ సదస్సులో బూత్‌ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, పార్టీ నేతలకు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్ధేశం చేయనున్నారని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top