రెండు రాష్ట్రాలలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు | YSR Death anniversary programs in Two Telugu States | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాలలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు

Aug 31 2014 7:15 PM | Updated on Jul 7 2018 3:36 PM

మహానేత వైఎస్ఆర్ - Sakshi

మహానేత వైఎస్ఆర్

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న సేవా కార్యక్రమాలు, విగ్రహాల వద్ద నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహించాలని వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి పిలుపు ఇచ్చారు.

హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న సేవా కార్యక్రమాలు, విగ్రహాల వద్ద నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహించాలని వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి పిలుపు ఇచ్చారు. వైఎస్ఆర్ సేవలు స్మరించుకునేలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆ మహానేత ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ గతిపట్టి ఉండేది కాదన్నారు. ఆయన మరణించిన తరువాత  రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని రెండుగా విభజించారన్నారు. ఏదిఏమైనా జరిగింది జరిగిపోయిందన్నారు.

తెలుగువారు ఐకమత్యంగా ఉండాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధిని వైఎస్ఆర్ సిపి కాంక్షిస్తుందని చెప్పారు.వర్ధంతి రోజున చేపట్టే కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలవాలని మైసూరా రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement