తెలుగు తమ్ముళ్ల బరితెగింపు | YSR CP subabul garden worker beheaded | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల బరితెగింపు

Aug 24 2015 4:26 AM | Updated on Aug 10 2018 8:35 PM

తెలుగు తమ్ముళ్ల బరితెగింపు - Sakshi

తెలుగు తమ్ముళ్ల బరితెగింపు

ఆ గ్రామంలో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు

♦ వైఎస్సార్ సీపీ కార్యకర్త సుబాబుల్ తోట నరికివేత
♦ కోర్టు ఆదేశాలు సైతం ధిక్కరించిన టీడీపీ కార్యకర్తలు
♦ బాధితుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని తహ శీల్దార్, ఎస్సై
♦ న్యాయం కోసం పోరాడుతున్న వృద్ధుడు లక్ష్మీనరసయ్య
 
 చిలంకూరు (మర్రిపూడి) : ఆ గ్రామంలో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. ఓ వైఎస్సార్ సీపీ కార్యకర్తను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన పెంచుకున్న సుబాబుల్ చెట్లను నరికి కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించినా తహశీల్దార్, ఎస్సై నోరుమెదపకపోవడం గమనార్హం. బాధితుని కథనం ప్రకారం.. మండలంలోని చిలంకూరుకు చెందిన రాయపాటి లక్ష్మీనరసయ్యకు 81 ఏళ్లు. ఆయన వైఎస్సార్ సీపీలో కార్యకర్తగా వ్యవహరిస్తునా ్నరు.

గ్రామంలోని సర్వే నంబర్ 82-3లో సుమారు 10 ఎకరాల భూమి ఉంది. లక్ష్మీనరసయ్యకు ఆ భూమి తన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చింది. భూమికి సంబంధించి పట్టాదారుపాస్‌పుస్తకాలు, ఎఫ్‌ఎల్‌ఆర్, ఒన్‌బీ, అడంగల్.. అన్ని సక్రమంగానే ఉన్నాయి. లక్ష్మీనరసయ్య తమ భూమి చుట్టూ రాతి స్తంభాలు పాతుకుని చుట్టూ ఇనుప కంచె వేసుకున్నాడు. గట్లపై టేకు, కొబ్బరి, వేప చె ట్లు నాటుకున్నాడు. అవి దాదాపు 30 అడుగుల ఎత్తు పెరిగాయి. 3 బోర్లతో పాటు ఓ బావి తవ్వించి మామిడి, సపోట, బత్తాయి చెట్లు సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో చెట్లు ఎండు ముఖం పట్టాయి.

ఈ నేపథ్యంలో ఆ భూమిపై టీడీపీ నేతల కన్నుపడింది. గ్రామంలో లక్ష్మీనరసయ్య వైఎస్సార్ సీపీ సానుభూతి పరునిగా, గ్రామస్థాయి నాయకునిగా ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. దీంతో టీడీపీ వర్గీయులు ఆయనపై కక్ష పెంచుకున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ మద్దతుదారులు రాయపాటి కోటేశ్వరరావు, ఆర్.కోటయ్య, ఆర్.ఆంజనేయులు, అనుసూయలు రంగంలోకి దిగి కూలీలతో ఈ నెల 17న ఫెన్సింగ్ తీగ తెగ్గొట్టి, రాళ్లు విరగ్గొట్టి దాదాపు 1000పైగా ఉన్న సుబాబుల్ చె ట్లను నరికేశారు.

 పోరుకు దిగిన బాధితుడు
 బాధితుడు లక్ష్మీనరసయ్య విషయాన్ని తహశీల్దార్ శ్రీనివాసుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. అధికారులు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. కోర్డు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చాడు. కోర్టు ఆదేశాలను సైతం భేఖాత ర్ చేసి నాయకులు, అధికారుల అండతో లక్ష్మీనరసయ్య భూమిని స్వాధీనం చేసుకునేందుకు టీడీపీ మద్దతుదారులు రంగం సిద్ధం చేసుకున్నారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని బాధితుడు చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement