వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య | ysr congress party leader vijay bhaskar reddy murdered in anantapuram district | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య

Mar 31 2015 12:02 PM | Updated on Aug 10 2018 6:49 PM

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ భాస్కర్ రెడ్డిని టీడీపీ వర్గీయులు దారుణంగా హతమార్చారు.

అనంతపురం : అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ భాస్కర్ రెడ్డిని టీడీపీ వర్గీయులు దారుణంగా హతమార్చారు. పెద్ద వడుగూరు మండలం కిష్టిపాడు గ్రామ సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్న అతనిపై  మంగళవారం ఉదయం టీడీపీ వర్గీయులు కొడవళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు.

 

సొసైటీ కార్యాలయంలో  విజయ్ భాస్కర్రెడ్డి సమావేశం నిర్వహిస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. దాంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement