రాయలసీమకు విదర్భ తరహా ప్యాకేజీ | YSR Congress Party Farmer Section incharge MVS Nagi Reddy comments | Sakshi
Sakshi News home page

రాయలసీమకు విదర్భ తరహా ప్యాకేజీ

Jan 3 2017 12:35 AM | Updated on Aug 15 2018 6:32 PM

రాయలసీమకు విదర్భ తరహా ప్యాకేజీ - Sakshi

రాయలసీమకు విదర్భ తరహా ప్యాకేజీ

సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేలా రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేలా రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు.పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడుతూ.. సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేలా రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. గత మూడు ఖరీఫ్‌ సీజన్లలోనూ ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో సగానికి సైగా రాయలసీమలో ఉన్నాయని తెలిపారు.

రాయలసీమకు విదర్భ తరహా ప్యాకేజీ కోరాలని సీఎంకు సూచించారు. రాష్ట్రంలో వేరుశెనగ 9.29 లక్షల హెక్టార్లకు 9 లక్షల హెక్టార్లు, కందిపంట 3.24 లక్షల హెక్టార్లకు 1.86 లక్షల హెక్టార్లు రాయలసీమ జిల్లాల్లోనే సాగయిందన్నారు. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలేక రోడ్డుపై పడేసిపోయే పరిస్థితులను గుర్తెరిగి వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆక్వా రంగంలో 24.5 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పుకోవడం దారుణమన్నారు. కృష్ణా బేసిన్‌లో నీరు లేక వేల ఎకరాలు ఎండిపోతే దిగుబడి సాధించామని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వాస్తవాలు దాచి ప్రజలను మోసం చేయడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు దక్కడం లేదన్నారు.

కర్నూలు జిల్లాలో 4 నుంచి రైతు భరోసా యాత్ర
కర్నూలు జిల్లాలో ఈ నెల 4నుంచి జరిగే రైతు భరోసా యాత్రలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని నాగిరెడ్డి తెలిపారు. ఆరు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పర్యటించి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించి వారికి భరోసా ఇస్తారని చెప్పారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి బతికి ఉండి ఉంటే 2014 నాటికే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తయి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేదని నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన హయాంలోనే అన్ని ప్రాజెక్టులు 70 నుంచి 75 శాతం పూర్తయ్యాయయని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement