ముంబయిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శింగవరపు ఎస్తేర్ అనూహ్య కుటుంబానికి వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సానుభూతి తెలిపారు.
మచిలీపట్నం: ముంబయిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శింగవరపు ఎస్తేర్ అనూహ్య కుటుంబానికి వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సానుభూతి తెలిపారు. అనూహ్య తండ్రి జొనాథన్ సురేంద్ర ప్రసాద్‌ను ఆమె ఫోన్లో పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని విజయమ్మ వారికి భరోసా ఇచ్చారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన అనూహ్య(23) హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 4న విజయవాడలో లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన అనూహ్య 16న (గురువారం సాయంత్రం) ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించింది. ఆమె హత్య ఎలా జరిగిందనేది ఇప్పటి వరకు తెలియదు.