‘దేవుడు వైఎస్‌ జగన్‌ పక్షాన ఉన్నాడు’ | YS Vijayamma Participated In Christmas Celebrations At Pulivendula CSI Church | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన విజయమ్మ

Dec 25 2018 9:56 AM | Updated on Dec 26 2018 7:41 AM

YS Vijayamma Participated In Christmas Celebrations At Pulivendula CSI Church - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: దేశవ్యాప్తంగా క్రిస్మస్‌ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, భారతి జార్జిరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డి పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ కుటుంబం తరఫున ప్రజలందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ‘దేవుడు నాకు మంచి భర్తను, కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి మంచి పరిపాలన ఇచ్చే శక్తిని ఇచ్చారు. దేవుని ఆశీర్వాదం వల్లే ఆయన కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారు. ఆయన మరణించాక ఈ తొమ్మిదేళ్ల జీవితం నాకు ఒక ఎత్తు. ఇటీవల వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం నుంచి దేవుని కృపే ఆయన్ను కాపాడింది. దేవుడు వైఎస్‌ జగన్‌ పక్షాన ఉన్నాడు. వైఎస్సార్‌లాగే వైఎస్‌ జగన్‌తో కూడా ప్రజలకు మరింత సేవ చేయించుకోవాలని దేవుడు భావించి ఉంటాడు. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌కు నిత్యం దేవుడు తోడుగా ఉండి కాపాడుతున్నాడు. రాబోయే రోజుల్లో దేవుడు వైఎస్‌ జగన్‌ లక్ష్యం నెరవేరుస్తాడ’ని అన్నారు. వైఎస్‌ జగన్‌ కోసం ప్రార్థిస్తున్న కోట్లాది మందికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement