అందరూ రాజీనామా చేయాలి: విజయమ్మ డిమాండ్ | YS Vijayamma demands all MPs and MLAs resignations for United State | Sakshi
Sakshi News home page

అందరూ రాజీనామా చేయాలి: విజయమ్మ డిమాండ్

Sep 21 2013 5:22 PM | Updated on Jul 25 2018 6:03 PM

అందరూ రాజీనామా చేయాలి: విజయమ్మ డిమాండ్ - Sakshi

అందరూ రాజీనామా చేయాలి: విజయమ్మ డిమాండ్

సమైక్య రాష్ట్రం కోసం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు.

హైదరాబాద్: సమైక్య రాష్ట్రం కోసం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశ ముగింపు సందర్భంగా ఆమె ప్రసంగించారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు,  కేంద్రరాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో సహా టీడీపీ ఎంపిలు, ఎమ్మెల్యేలంతా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేద్దామని పిలుపు ఇచ్చారు. ఓట‌్లు, సీట్ల కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటాలు చేయదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీలే ఆ పని చేస్తాయన్నారు.

సమైక్య ఉద్యమాన్ని కార్యకర్తలు, నేతలు, అభిమానులు బాగా చేశారన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ఉద్దృతం చేద్దామని పిలుపు ఇచ్చారు.  చంద్రబాబు తన లేఖను వెనక్కు తీసుకోవాలని గట్టిగా ఒత్తిడి తెద్దామని చెప్పారు. ప్రజలందరి బాగు కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఎప్పటికీ పాటుపడుతుందన్నారు. మనమంతా కలిసి వైఎస్ఆర్ కలలుకన్న సువర్ణయుగం సాధిద్దామని చెప్పారు.

 వైఎస్‌ విజయమ్మ అధ్యక్షత వహించిన  పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి  పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర పాలక మండలి సభ్యులు, జిల్లా, మండల నేతలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement