అక్కచెల్లెమ్మలందరూ చల్లంగా ఉండాలి: వైఎస్‌ జగన్‌ | YS Sharmila ties Rakhi to YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

అక్కచెల్లెమ్మలందరూ చల్లంగా ఉండాలి: వైఎస్‌ జగన్‌

Aug 8 2017 2:16 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఆత్మీయతానుబంధాలను చాటే ఈ విశిష్టమైన పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన చెల్లెలు షర్మిల రాఖీ కట్టారు.



హైదరాబాద్:
అన్నా-చెల్లెలి అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఆత్మీయతానుబంధాలను చాటే ఈ విశిష్టమైన పర్వదినాన్ని పురస్కరించుకొని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన చెల్లెలు షర్మిల రాఖీ కట్టారు. తనకు వైఎస్‌ షర్మిల ఆత్మీయంగా రాఖీ కడుతున్న ఫొటోను వైఎస్‌ జగన్‌ తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు. అక్కచెల్లెమ్మలందరూ ఇప్పుడు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.     

అంతకుముందు రాఖీపౌర్ణమి పండుగ సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెలెళ్ల ప్రేమానుబంధాలను, పరస్పర అనురాగాన్ని చాటే రాఖీపౌర్ణమి ఒక విశిష్టమైన పండుగ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పర్వదినం మన ప్రజల్లో సోదరభావాన్ని, ఐక్యతను చాటాలని ఆకాక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement