
సాక్షి, తాడేపల్లి: రాఖీ పండుగ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, మహిళకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రంలోని నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రక్షా బంధనం అన్నది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా.. మహిళలకు ఎప్పుడూ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.#RakshaBandhan
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2025