
వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన పులివెందుల మెడికల్ కళాశాల
నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్
గత ప్రభుత్వంలో చేపట్టిన 10 ప్రభుత్వ వైద్య కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్న చంద్రబాబు
66 ఏళ్ల పాటు ప్రైవేట్‌కు కట్టబెడుతున్న దుస్థితి
ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల పూర్తికి 15.. 23 ఏళ్లు పడుతుందని దు్రష్పచారం
17 కళాశాలల నిర్మాణానికి గత ప్రభుత్వంలోనే రూ.8,480 కోట్ల నిధుల సమీకరణ
2023–24లో ఐదు.. 2024–25లో ఐదు.. 2025–26లో ఏడు ప్రారంభించేలా రోడ్ మ్యాప్
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ మేరకు వేగంగా అడుగులు
2023–24లో ఐదు కళాశాలలు ప్రారంభించి 750 సీట్లు సమకూర్చిన వైనం
2024లో గద్దెనెక్కిన వెంటనే కళాశాలల నిర్మాణాలు ఆపేసిన బాబు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరుకు సిద్ధం అయ్యారు. గత ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమైన నర్సీపట్నం వైద్య కళాశాలను నేడు ఆయన స్వయంగా సందర్శించనున్నారు. తద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలను పరిరక్షించేలా.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి అంకురార్పణ చేయనున్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు, మన విద్యార్థుల డాక్టర్ కలను సాకారం చేయడం కోసం గత ప్రభుత్వంలో రూ.8,480 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) నిర్వహణ పేరిట ప్రజా సంపద అయిన వైద్య కళాశాలలను పచ్చ కార్పొరేట్ గద్దలకు 66 ఏళ్ల పాటు లీజు పేరుతో కారు చౌకగా, అప్పనంగా బాబు ప్రభుత్వం కట్టబెడుతోంది. రెండు దశల్లో 10 వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు ధారాదత్తం చేసేలా ప్రణాళికలు రచించి, ఇప్పటికే తొలి దశలో నాలుగు కళాశాలలకు టెండర్‌లు పిలిచిన విషయం తెలిసిందే.
ఉన్నత ఆశయానికి తూట్లు
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చి, ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను అందుబాటులోకి తెస్తామని 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ మేరకు జిల్లాల పునర్విభజన చేయడమే కాకుండా ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త కళాశాలల నిర్మాణం చేపట్టారు. కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రులను హబ్‌లుగా అభివృద్ధి చేసి, జిల్లా పరిధిలోని ప్రైమరీ, సెకండరీ హెల్త్ ఆస్పత్రులను అనుసంధానించి.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా నాణ్యమైన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని సంకల్పించారు.
వైఎస్ జగన్ విధానంలో ప్రతి వైద్య కళాశాల, బోధనాస్పత్రి పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచేవి. వీటిలో పనిచేసే ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బందిని ప్రభుత్వమే నియమించేది. కళాశాల, ఆస్పత్రిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేది. ఎక్కడా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల అజమాయిïÙ, వారి లాభార్జనకు ఆస్కారం లేదు. దీంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ జబ్బులకు చికిత్సతో పాటు, అవయవాల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు, రక్త పరీక్షలు, ఇతర డయగ్నోస్టిక్ సేవలు ప్రజలకు పూర్తి ఉచితంగా లభించేవి. దీంతో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి లభించేది.
ఈ ఉన్నత ఆశయానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టి, ప్రజలు మళ్లీ కార్పొరేట్ దోపిడీకి గురయ్యేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేట్‌కు కట్టబెడుతున్న వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలే ఉండబోవని ప్రభుత్వం రూపొందించిన టెండర్ నిబంధనలే చెబుతున్నాయి. 620 పడకల సామర్థ్యంతో నడిచే బోధనాస్పత్రుల్లో ఒక్కటంటే ఒక్క పడక కూడా ఉచిత వైద్యానికి కేటాయించరు. ఈ కళాశాలల్లో వంద శాతం పడకలతో కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేసుకోనున్నాయి.
ప్రైవేట్ తరహాలోనే ఫీజుల దోపిడీ
⇒ కొత్త వైద్య కళాశాలలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు ఆరి్థక వనరులు సమకూర్చుకునే లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కంటే ఎంతో తక్కువగా ఫీజులు ఖరారు చేసింది.
⇒ మధ్య తరగతి కుటుంబాల వారు సైతం భరించగలిగేలా ఎంబీబీఎస్ సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఉండే 35 శాతం సీట్లకు రూ.12 లక్షలు, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ సీట్లకు రూ.20 లక్షల చొప్పున ఫీజుల విధానం ప్రవేశపెట్టారు. ఈ నిధులను కేవలం ఆ వైద్య కళాశాలల అభివృద్ధి కోసమే వెచ్చించేలా ప్రణాళిక వేశారు. అంతకు మించి ప్రైవేట్ కళాశాలల్లో మాదిరిగా విద్యార్థులపై ఫీజుల దోపిడీ లేకుండా చేశారు. ఈ విధానంపై అప్పట్లో కూటమి పార్టీలు, ఎల్లో మీడియా తీవ్ర స్థాయిలో దు్రష్పచారం చేశాయి.
⇒ తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సెల్ప్ ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక తమదైన శైలిలో విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తూ ఏకంగా కళాశాలలనే ప్రైవేట్‌కు
కట్టబెట్టేస్తున్నారు.
⇒ బాబు ప్రవేశపెట్టిన పీపీపీ విధానంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే ఫీజుల దోపిడీకి లైసెన్స్ ఇచ్చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ బీ కేటగిరి సీటుకు ఏటా రూ.13.20 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటాకు రూ.39.60 లక్షల ఫీజులు ప్రైవేట్‌లో వసూలు చేస్తున్నారు. ఇదే ఫీజుల స్వరూపాన్ని పీపీపీకి ప్రభుత్వం ప్రతిపాదించింది.

⇒ ఈ లెక్కన 5 ఏళ్లకు సెల్ఫ్ ఫైనాన్స్ సీటుపై రూ.6 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటాలో రూ.98 లక్షల చొప్పున విద్యార్థులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం నడిపే వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఏడాది పాటు హౌస్ సర్జన్‌గా సేవలు అందించే సమయంలో నెలకు రూ.26 వేల చొప్పున ఏడాదికి రూ.3.12 లక్షల స్టైఫండ్ ఇస్తారు. ఈ నేపథ్యంలో కొత్త వైద్య కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే స్టైఫండ్ సరిగా అందదు. దీనికి తోడు అదనపు ఫీజుల దోపిడీకి గురవుతారు.
⇒ భవిష్యత్‌లో అందుబాటులోకి వచ్చే పీజీ సీట్లకు సైతం బీ కేటగిరికి రూ.9.93 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటాకు రూ.57.50 లక్షలు చొప్పున ఫీజులు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పైకి మాత్రం విద్యార్థులపై ఎటువంటి భారం ఉండదని ప్రచారం చేస్తుండటం గమనార్హం.
కళ్లెదుటే సాక్ష్యం
⇒ ఏపీ విభజన చట్టంలో భాగంగా మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మాణం చేపట్టింది. 2016–17లో నిర్మాణానికి కేంద్రం శంకుస్థాపన చేసింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టుగా ఏక కాలంలో నిర్మాణాలన్నీ చేపట్టాక ఎయిమ్స్ కార్యకలాపాలు ప్రారంభించలేదు. కేవలం 50 మంది విద్యార్థులతో తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభించింది.
⇒ రెండు బ్యాచ్‌లకు విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలోనే తరగతులు నిర్వహించారు. మంగళగిరిలో విద్యార్థులకు తరగతుల నిర్వహణకు వీలుగా భవనాలు అందుబాటులోకి వచ్చాకే విద్యార్థులను అక్కడికి తరలించారు. 2016–17లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ నిర్మాణం గతేడాదిలో పూర్తి అయింది. అంటే దాదాపు తొమ్మిదేళ్లు ఎయిమ్స్ నిర్మాణం కొనసాగింది. అయితే వైఎస్ జగన్ చేపట్టిన నిర్మాణాల విషయంలో మాత్రం ఒకేసారి నిర్మాణాలెందుకు పూర్తి చేయలేదన్నట్టుగా బాబు ప్రభుత్వం దాడి చేస్తూ అభాసుపాలవుతోంది.
నేడు వైఎస్ జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (గురువారం) అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (ఎన్‌ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్ మీదుగా) వెళతారు. అక్కడ కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా నిర్మాణం నిలిపి వేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ (వయా తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్‌ఏడీ జంక్షన్)కు చేరుకుంటారు. విష జ్వరాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శిస్తారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.
15.. 23.. ఏళ్లు ఎందుకు పడుతుంది?
⇒ 17 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తేవడం కోసం కేంద్ర సాయం, స్పెషల్ అసిస్టెన్స్ టు ది స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పథకం, నాబార్డు లోన్‌ల ద్వారా రూ.8,480 కోట్ల నిధులు గత ప్రభుత్వంలోనే సమకూర్చారు. ఈ క్రమంలో కళాశాలల నిర్మాణానికి నిధుల సమస్య లేదు.
⇒ గత ప్రభుత్వంలో 2023–24లో ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలు ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చారు.
⇒ 2024–25లో పులివెందుల, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పాడేరు కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు మొదలయ్యే నాటికే పాడేరు, పులివెందుల వైద్య కళాశాలలను సిద్ధం చేశారు. మిగిలిన మూడు కళాశాలలు సైతం మొదటి ఏడాది తరగతులకు సంబంధించి చిన్న చిన్న వసతులు సమకూర్చాల్సి ఉండింది.
⇒ ఈ చర్యల ఫలితంగానే గతేడాది పాడేరు, పులివెందులకు 50 చొప్పున సీట్లతో అడ్మిషన్లకు ఎన్‌ఎంసీ అనుమతులు ఇచ్చింది. తరగతులు ప్రారంభం అయ్యే నాటికి మిగిలిన సౌకర్యాలు సమకూరుస్తామని ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే ఆదోని, మదనపల్లె, మార్కాపురం కళాశాలలు కూడా ప్రారంభం అయి ఉండేవి.
⇒ వైఎస్ జగన్ విధానంలో వెళితే కళాశాలలు పూర్తి చేయడానికి 15 ఏళ్లు.. 23 ఏళ్లు పడుతుందని ప్రభుత్వం దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. దేశంలో ఎక్కడైనా ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వ రంగాల్లో వైద్య కళాశాలలను వంద శాతం నిర్మాణం పూర్తి చేశాకే ప్రారంభించరనే వాస్తవాన్ని మరుగున పరుస్తోంది.
⇒ రూ.వందల కోట్ల ప్రజా ధనాన్ని దుబారా చేస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన వైద్య కళాశాలల నిర్మాణానికి మాత్రం నిధులు లేమిని సాకుగా చూపుతుండటంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
⇒ అస్మదీయులకు మేలు చేయడం కోసం సీఎం చంద్రబాబు చేసిన కుట్రలతో రాష్ట్ర విద్యార్థులు రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారు.