నేడు మదనపల్లికి వైఎస్‌ జగన్‌ | ys jaganmohanreddy to be attend marriage in madanapally | Sakshi
Sakshi News home page

నేడు మదనపల్లికి వైఎస్‌ జగన్‌

Feb 4 2017 8:31 AM | Updated on Apr 4 2018 9:31 PM

నేడు మదనపల్లికి వైఎస్‌ జగన్‌ - Sakshi

నేడు మదనపల్లికి వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం మదనపల్లి రానున్నారు.

మదనపల్లిలో ఎమ్మెల్యే కుమార్తె వివాహం
పులివెందుల నుంచి కదిరి మీదుగా రాక

మదనపల్లి (చిత్తూరు జిల్లా) :
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం మదనపల్లి రానున్నారు. మదనపల్లి శాసనసభ్యులు డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి కుమార్తె కరిష్మా దేశాయ్, వరుడు లక్ష్మీకాంతరెడ్డిలను ఆశీర్వదించనున్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ఉన్న వైఎస్‌ జగన్‌ సాయంత్రం 3 గంటలకు అనంతపురం జిల్లా కదిరి, నల్లచెరువు, తనపల్లి, ములకలచెరువు మీదగా మదనపల్లి చేరుకుంటారని వైఎస్సార్‌సీపీ  నేతలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో భారీ స్వాగతానికి తంబళ్లపల్లి ఇన్‌చార్జి పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు జిల్లా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ ప్రముఖులు మదనపల్లి బయలుదేరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement