
ప్రజలందరికీ శుభాలు కలగాలి: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీలోని ఒంటిమిట్ట, తెలంగాణలోని భద్రాద్రి పుణ్యక్షేత్రాలతోపాటు రెండు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలందరికీ శుభాలు కలిగేలా సీతారాముల ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.