వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు | ys jaganmohan reddy srikakulam tour cancelled over mlc elections | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు

Feb 19 2017 5:26 PM | Updated on Aug 29 2018 6:26 PM

వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు - Sakshi

వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు

ఈ నెల 21న శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన రద్దు అయినట్లు రెడ్డి శాంతి తెలిపారు.

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు అయినట్లు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తెలిపారు. ఈ నెల 21న వంశధార నిర్వాసిత గ్రామాల్లో జగన్‌ పర్యటించాల్సి ఉంది. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పర్యటన రద్దు అయినట్లు ఆమె చెప్పారు.      

శ్రీకాకుళంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యే వెంకటరమణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల నుంచి ఎమ్మెల్యే కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. నిర్వాసితులకు అందించే నష్టపరిహారం చెక్కుల్లో ఆయన భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు త్వరలో బయటపెడతామని రెడ్డి శాంతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement