'ముగ్గురు నేతలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు' | ys jagan samaikya shankharavam in bhogapuram | Sakshi
Sakshi News home page

'ముగ్గురు నేతలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు'

Feb 9 2014 1:32 PM | Updated on Jul 25 2018 4:07 PM

'ముగ్గురు నేతలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు' - Sakshi

'ముగ్గురు నేతలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు'

ముగ్గురు నేతలు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పూనుకుంటున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.

భోగాపురం: ముగ్గురు నేతలు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పూనుకుంటున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీల వల్లే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని జగన్ విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా విజయనగరం జిల్లాలోని భోగాపురం సభలో ప్రసంగించారు. ముందుగా వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. రామరాజ్యం చూడలేదు కాని వైఎస్ హయాంలోసువర్ణయుగం చూశామని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని తెలిపారు. మహానేత చనిపోయి నాలుగున్నర ఏళ్లు అయినా ప్రజల గుండెల్లో ఆ మహానేత ఎప్పటికీ నిలిచిపోయారని జగన్ అన్నారు.

 

ప్రతి పేద వాడి గుండె చప్పుడు, ప్రతి పేదవాడి మనసెరిగి ఆ మహానేత పాలన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయాలు మరింతగా దిగజారాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాల మధ్య .ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారన్నారు. విభజన బిల్లు వచ్చినప్పుడే సీఎం కిరణ్ రాజీ నామా చేసుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలుచుకుని రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచిన వారినే ప్రధానిగా చేద్దామని జగన్ విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement