
సాక్షి, గోనెగండ్ల : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామ శివారు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను వైఎస్ జగన్‌కు విన్నవించుకున్నారు. మరి కాసేపట్లో గోనెగండ్లలో వైఎస్ జగన్... ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.