
సామర్లకోట(తూర్పుగోదావరి జిల్లా): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 219వ రోజు షెడ్యూల్ ఖరారైంది. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత సోమవారం ఉదయం సామర్లకోట మండలంలోని ఉండూరు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా రైల్వే స్టేషన్ సెంటర్ వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం లంచ్ విరామం తీసుకుంటారు. తిరిగి లంచ్ క్యాంప్ నుంచి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర చేపడతారు. సామర్లకోట మాతం సెంటర్, అయోధ్యా రామాపురం, చలపతి నగర్ మీదుగా గణపతి నగర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు
ముగిసిన పాదయాత్ర: రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 218వ రోజు తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా ముగిసింది. జననేత ఆదివారం ఉదయం పెద్దాపురం నియోజకవర్గం అచ్చంపేట జంక్షన్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సామర్లకోట మండలం గొంచాల, బ్రహ్మానందపురం, పీ.వేమవరం శివారు మీదుగా ఉండూరు వరకు నేటి పాదయాత్ర కొనసాగింది. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర జరుగుతోన్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది.