సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజాయతీగా వ్యవహరిస్తున్నారని సచివాలయం సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు మురళీ కృష్ణ, వెంకటేశ్వర్లు అన్నారు.
హైదరాబాద్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజాయతీగా వ్యవహరిస్తున్నారని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు మురళీ కృష్ణ, వెంకటేశ్వర్లు అన్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఈరోజు ఉదయం జగన్తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని జగన్ హామీ ఇచ్చారన్నారు. ముందుగా ఎంపీ పదవికి రాజీనామా చేసింది జగనేనని అన్నారు.
హైదరాబాద్ నుంచి బయటకు రాలేని కారణంగా...ఈ 27న ఢిల్లీలో చేపట్టనున్న తమ ధర్నాకు పార్టీ ప్రతినిధులను పంపిస్తానని చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని వారు మండిపడ్డారు. టీపీడీ ఎంపీలో ధర్నా చేయాల్సింది.... పార్లమెంట్లో కాదని, చంద్రబాబు నివాసం ముందు చేయాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు.