‘తెలుగు పత్రికా రంగంలో మోహన్‌ ధ్రువతార’ | YS Jagan Mohan Reddy's condolences to cartoonist Mohan | Sakshi
Sakshi News home page

‘తెలుగు పత్రికా రంగంలో ఆయన ధ్రువతార’

Sep 21 2017 8:14 AM | Updated on Jul 25 2018 4:09 PM

‘తెలుగు పత్రికా రంగంలో మోహన్‌ ధ్రువతార’ - Sakshi

‘తెలుగు పత్రికా రంగంలో మోహన్‌ ధ్రువతార’

ప్రముఖ కార్టునిస్ట్‌ మోహన్‌ మృతి పట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ కార్టునిస్ట్‌ మోహన్‌ మృతి పట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. కార్టునిస్ట్‌ మోహన్ తెలుగు పత్రికా చరిత్రలో గొప్ప కార్టూనిస్టుల కోవకు చెందినవారని వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రముఖ దినపత్రికల్లో రాజకీయ కార్టునిస్టుగా పనిచేసిన మోహన్‌ దశాబ్దాల పాటు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, మోహన్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కాగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కార్టునిస్టు మోహన్‌ బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌ లో సందర్శనార్థం ఉంచనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement