
విజయనగరం మున్సిపాలిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి 2019 సంవత్సరంలో జరగనున్న ఎన్నికల్లో సీఎం కావడం తథ్యమని ఆ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సత్య కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వందలాదిగా తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) కేక్ కట్ట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని విజయపథంలో నడిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పిళ్లా విజయకుమార్, పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, విక్రమ్, మార్క్‌ఫెడ్ డైరెక్ట్ కె.వి.సూర్యనారాయణరాజు, మాజీ ఎంపీపీ జగ్గారావు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.