వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రకాశం జిల్లా టంగుటూరులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
ఒంగోలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రకాశం జిల్లా టంగుటూరులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు కేంద్రంలో పొగాకు రేట్ల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. లో క్వాలిటీ పొగాకుకు కనీస ధర ఇవ్వడం లేదని రైతులు ...వైఎస్ జగన్ వద్ద వాపోయారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని కూడా తగ్గించి పొగాకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిపై పొగాకు బోర్డు అధికారులను నిలదీస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
కాగా అంతకు ముందు వైఎస్ జగన్ టంగుటూరు మండలం పొందూరు గ్రామపంచాయతీ పొదవారిపాలెంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించారు. అప్పుల బాధతో, పొగాకుకు సరైన ధర లేకపోవటంతో మనస్తాపం చెంది రైతు కృష్ణారావు పురుగుల మందు తాగి ఈ నెల 11 న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.