వైఎస్‌ జగన్‌ అనంతపురం పర్యటన ఖరారు | YS Jagan Anantapur Visit Confirmed, Check Schedule And Other Details Here | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ అనంతపురం పర్యటన ఖరారు

Apr 5 2025 12:02 PM | Updated on Apr 5 2025 1:54 PM

YS Jagan Anantapur Visit Confirmed Check Details Here

అనంతపురం, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అనంతపురం(Anantapur) జిల్లా పర్యటన ఖరారైంది. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు బలైన పార్టీ కార్యకర్త  కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఆయన పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డి శనివారం ప్రకటించారు. 

రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరిటాల వర్గీయుల చేతిలో ఉగాది నాడు వైఎస్సార్‌సీపీ కార్యకర్త లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్‌ జగన్‌(YS Jagan).. బాధిత కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడారు. తమకు ప్రాణహాని ఉందని లింగమయ్య కుటుంబ సభ్యులు జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వాళ్లకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని, అవసరమైతే న్యాయపరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో త్వరలో వచ్చి కలుస్తానంటూ మాట ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌ పర్యటన వేళ.. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైఎస్సార్‌సీపీ కీలక నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement