ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు నీలం వెంకటరావు కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు.
ఒంగోలు : ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు నీలం వెంకటరావు కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. కొండ సముద్రంలోని వెంకటరావు నివాసానికి వెళ్లిన ఆయన ఆ కుటుబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఒంగోలు బయల్దేరి వెళ్లారు. కాగా అంతకు ముందు పొదవారిపాలెంలో బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.