వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీఎం జగన్‌ 

YS Jagan Inaugurates YSR Sports Complex In Pulivendula - Sakshi

సాక్షి, పులివెందుల : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి​  బుధవారం పులివెందులలో వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. పులివెందులలో రూ. 347 కోట్లతో నిర్మించనున్న వైఎస్సార్‌ ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. శంకుస్థాపనలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. వాటర్‌గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందజేస్తామని తెలిపారు. మొత్తంగా రూ. 1329 కోట్లతో నియోజకవర్గంలో తొలి దశ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.‘నాన్నను అమితంగా ప్రేమించారు.. ఇప్పుడు నా వెన్నంటే ఉంటున్నారు. మీ బిడ్డగా రుణంగా తీర్చుకుంటాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

అలాగే పులివెందుల మినీ సచివాలయానికి రూ. 10 కోట్లు, ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్‌ కోసం రూ. 20 కోట్ల కేటయిస్తున్నట్టు సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. గండికోట రిజర్వాయర్‌ దిగువన 20 టీఎంసీల నిల్వతో డ్యామ్‌ నిర్మిచనున్నట్టు చెప్పారు. పులివెందులలో మోడల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. అంతకుముందు పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబసభ్యులు, ప్రజలతో కలిసి పాల్గొన్నారు. కాగా, నేటితో సీఎం వైఎస్‌ జగన్‌ మూడు రోజుల జిల్లా పర్యటన  ముగియనుంది. సాయంత్రం ఆయన తాడేపల్లికి బయలుదేరి వెళతారు. 

సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన శంకుస్థాపనల వివరాలు..

  • రూ.347 కోట్లతో వైఎస్సార్‌ ప్రభుత్వ వైద్య కళాశాల
  • గాలేరు- నగరి సుజల స్రవంతి మెయిన్‌ కెనాల్‌ నుంచి అలవలపాడు ట్యాంక్, వేముల, వేంపల్లె మండలాలకు నీరందించే ఎత్తిపోతల పథకం.
  • చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి ఎర్రబల్లె ట్యాంక్, లింగాల, పులివెందుల మండలాలతోపాటు వేముల మండలంలోని యురేనియం ప్రభావిత గ్రామాలకు నీరందించే ఎత్తిపోతల పథకం.
  • పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ.100 కోట్ల నిధులతో చేపట్టే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు
  • రూ.65కోట్లతో పులివెందులలో తాగునీటి సరఫరాకు పైపుల లైన్ల నిర్మాణం
  • వేంపల్లెలో రూ.63 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులు
  • నియోజకవర్గంలో 7 మార్కెటింగ్‌ గిడ్డంగులు, మార్కెట్‌ యార్ట్‌ ఆధునికీకరణ
  • ఉద్యానవన పంటల కోసం కోల్డ్‌ స్టోరేజ్‌
  • వెంపల్లి ఆస్పత్రిలో 30 పడకల నుంచి 50 పడకలకు పెంపు
  • రూ.17.50 కోట్లతో  ఇంటిగ్రెటేడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు.. ఇక్కడ 14 రకాల ఆటలకు శిక్షణ
  • 32 గ్రామ సచివాలయ భవనాలు
  • జేఎన్‌టీయూలో రూ.20 కోట్లతో లెక్చరర్‌ కాంప్లెక్స్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌
  • వేంపల్లెలో డిగ్రీ , ఉర్దూ జూనియర్‌ కళాశాలలు.
  • వేంపల్లెలో బీసీ బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణాలు. 


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top