వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన రెడ్డి రేపటి నుంచి చంచల్గూడ జైలులో ఆమరణదీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్(సిజిసి) సభ్యుడు కొణతాల రామకృష్ణ ప్రకటించారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన రెడ్డి రేపటి నుంచి చంచల్గూడ జైలులో ఆమరణదీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్(సిజిసి) సభ్యుడు కొణతాల రామకృష్ణ ప్రకటించారు. ఈ రోజు రామకృష్ణతోపాటు ఆ పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణ దాసు చంచల్గూడ జైలులో జగన్మోహన రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా
ఉంచాలన్న డిమాండ్‌తో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో అయిదు రోజుల పాటు నిరాహారదీక్ష చేయడంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు తెలిపారు. ఆమెకు వెంటనే వైద్యం చేయకపోతే ప్రమాదమని వైద్యులు చెప్పడంతో జగన్మోహన రెడ్డి జైలు నుంచే తల్లితో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. జైలు అధికారుల అనుమతితో రూపాయి కాయిన్ బాక్సు నుంచి జగన్ మాట్లాడినట్లు ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజన సమస్యను మరింత జఠిలం చేసేవిధంగా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా జగన్మోహన రెడ్డి జైలులోనే రేపటి నుంచి ఆమరణ దీక్ష ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. జైలు నిబంధనల ప్రకారమే అనుమతి తీసుకొని దీక్ష చేస్తారన్నారు.