అందరికీ అను‘గృహం’..

YS Jagan Guaranteed Housing Scheme To All Poor People - Sakshi

సాక్షి, ప్రత్తిపాడు : పేదవాని గూడు గోడుగానే మిగిలిపోతోంది. కలల సౌథం కూలిపోతోంది. అర్హత ఉండీ ఇళ్లు మంజూరు కాని వారు కొందరు..మంజూరై బిల్లులు రాని వారు ఇంకొందరు.. బిల్లులు రాక ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేసిన వారు మరికొందరు.. ఇలా ఎన్టీఆర్‌ హౌసింగ్‌ కింద ఇళ్లు నిర్మించుకున్న వారి బాధ అంతులేకుండా ఉంది. ఇలాంటి పేదలందరికీ గూడు కల్పించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన ప్రతి పేదవానికీ పక్కా ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చారు. అంతేకాదు ఇచ్చిన రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని చెప్పారు. దీనిపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.  

వైఎస్‌ జగన్‌ ప్రకటించిన పథకం వివరాలు 

  • పేదలందరికీ పక్కా ఇళ్లు
  • ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం 
  • ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌
  • డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణ సదుపాయం

పక్కా ఇళ్ల నిర్మాణాల వివరాలు.. 
టీడీపీ హయాంలో మంజూరైన ఇళ్లు : 3,61,732
అసంపూర్తిగా నిలిచిన ఇళ్లు : 21,568
ప్రారంభం కాని ఇళ్లు : 60,279 

అందరికీ ఇళ్లు గొప్ప విషయం
టీడీపీ ప్రభుత్వ హయాం లో పక్కా ఇళ్లు నిర్మించుకోవాలంటే జన్మభూమి కమిటీల దయ తప్పని సరి. అలాంటి వారికే   ఇల్లు మంజూరు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా అర్హులకు ఇస్తామని చెప్పడం గొప్ప విషయం. 
– కొత్త అమేష్, బీకేపాలెం

జగన్‌ హామీ హర్షణీయం
ఇళ్లు నిర్మించుకుని బిల్లులు రాక లబ్ధిదారులు అగచాట్లు పడుతున్నారు. మండలాల్లోని హౌసింగ్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. నిర్మించుకున్న ఐదారు నెలలకు కూడా బిల్లులు రాని దుస్థితి ఉంది.వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. ఆయన మాటిస్తే నెరవేరుస్తారు. అందుకే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– బాపతు శ్రీనివాసరెడ్డి, ప్రత్తిపాడు
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top