బాలచందర్ మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం | ys jagan condolences director balachander's death | Sakshi
Sakshi News home page

బాలచందర్ మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం

Dec 23 2014 8:39 PM | Updated on Sep 28 2018 3:39 PM

ప్రఖ్యాత సినీ దర్శకుడు కె. బాలచందర్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: ప్రఖ్యాత సినీ దర్శకుడు కె. బాలచందర్ మృతి పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మశ్రీ అవార్డులతో పాటు తొమ్మిది జాతీయ ఫిల్మ్ అవార్డులు సాధించి దేశంలోనే అత్యన్నత స్థాయి దర్శకులలో ఒకరిగా ప్రసిద్ధి చెందిన ఆయన మరణం భారతీయ చలన చిత్రరంగానికి తీరని లోటు అని జగన్ ఓ ప్రకటనలో తెలిపారు.

 

అనేక ఆణిముత్యాల వంటి చిత్రాలను అందించిన ఆయన చలన చిత్ర రంగంలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికారని కొనియాడారు. బాలచందర్ కుటుంబ సభ్యలకు ఆయన తన ప్రగాడ సంతాపం, సానుభూతిని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement