శ్రీశైలం పాతాళగంగలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. హైదరాబాద్ నుంచి శనివారం నలుగురు యువకులు శ్రీశైలం వెళ్లారు.
శ్రీశైలం (కర్నూలు జిల్లా) : శ్రీశైలం పాతాళగంగలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. హైదరాబాద్ నుంచి శనివారం నలుగురు యువకులు శ్రీశైలం వెళ్లారు. వారు దైవ దర్శనం అనంతరం పాతాళగంగలో ఈత కొడుతుండగా ఓంకార్(20) అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. మిగిలిన ముగ్గురు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.
ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో ఓంకార్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. మృతుడు హైదరాబాద్ బషీర్‌బాగ్‌కు చెందిన వాడని అతని స్నేహితులు తెలిపారు.