యువకులకు యరపతినేని బెదిరింపు

Yarapathineni Srinivasa Rao warns YSRCP Activists - Sakshi

సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నవారికి హెచ్చరిక

పిడుగురాళ్ల (గురజాల): గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియాకు చెందిన యువకులపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బెదిరింపులకు దిగారు. వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా యువకులు ప్రతి ఒక్కరి పేర్లు, చిరునామాలు అన్నీ డైరీలో నమోదు చేస్తున్నామని, టీడీపీ ప్రభుత్వం వస్తే వారి సంగతి చూస్తామంటూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టారు. యరపతినేని వ్యాఖ్యలను నియోజకవర్గంలో పలువురు నేతలు తప్పు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ప్రవర్తన మారలేదని, బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. 

కాగా, గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యరపతినేని, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల విచారణను గత ఏడాది డిసెంబర్‌లో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన గ్రానైట్‌ విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. (2014లో సొంత ఇల్లు లేదు.. నేడు కోట్లకు పడగలు!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top