
రాజన్న రాజ్యాన్ని సాధిద్దాం
రాజన్న రాజ్యం కోసం అందరం ఐక్యంగా పోరాడదామని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమరనాథ్ అన్నారు.
కోటవురట్ల, న్యూస్‌లైన్ : రాజన్న రాజ్యం కోసం అందరం ఐక్యంగా పోరాడదామని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమరనాథ్ అన్నారు. ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయరాజు, పాయకరావుపే ట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చెంగల, ఏటికొప్పాక షుగర్స్ చైర్మన్ రామ భద్రరాజు, రామచంద్రరాజు తది తరులతో కలిసి ఆయన కోటవురట్లలో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలూ కైవసం చేసుకుని జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇద్దామన్నారు. రెండు ముక్కలైన తెలుగుజాతిని కాపాడగల నేత జగన్ మాత్రమేనన్నారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చవద్దంటూ పోరాడిన ఏకైక హీరో జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మహానేత వైఎస్సారే ఉండుంటే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టేదికాదన్నారు. పేదల కోసం ఆయన అందించిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఒంటిచేత్తో పార్టీని గెలిపించి ఇటు రాష్ట్రాన్ని అటు దేశాన్ని గాడిలో పెట్టినే నేత వైఎస్సార్ అన్నారు.
తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనంతా అవినీతిమయమేనన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే అమ్మఒడి పథకం, పింఛన్ సొమ్ము పెంపు, డ్వాక్రా రుణాల మాఫీతో బాటు వైఎస్సార్ సంక్షేమ పథకాలన్నీ దిగ్విజయంగా అమలవుతాయన్నారు. మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడేలా కలసికట్టుగా కృషిచేద్దామన్నారు. ఫ్యాన్‌గుర్తును ప్రజలందరికీ వివరించాలని, అఖండ మెజార్టీతో గెలుపొంది, సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని పిలుపునిచ్చారు. ఇంకొంత కాలం శ్రమిస్తే ప్రజలందరి కష్టాలు తీరతాయన్నారు.
అనంతరం 16 ఎంపీటీసీ స్థానాలకు సంబందించి అభ్యర్ధులను ఖరారు చేసి వారికి బిఫారాలను ఎమ్మెల్సీ, చెంగల అందించారు. జానకి శ్రీను అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సత్యనారాయణరాజు, దత్తుడు సీతబాబు, పైల రమేష్, యల్లపు కుమారరాజా, పులగాల నర్సింహమూర్తి, కిల్లాడ శ్రీనివాసరావు, రాజులనాయుడు పాల్గొన్నారు.
అనంతరం అమర్‌నాథ్ రావికమతంతో సమన్వయకర్త ధర్మశ్రీతో కలసి కార్యకర్తల సమావేశంలో అమర్‌నాథ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచూపాలని పిలుపునిచ్చారు. అచ్యుతాపురంలో మాట్లాడుతూ జనబలం ముందు టీడీపీ ఎత్తులు చంద్రబాబు జిత్తులు చిత్తవుతాయన్నారు. తన పాలనలో చంద్రబాబు పేదలకు నరకం చూపించారన్నారు.