నీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు | Womens Protest On Road For Water In Prakasam | Sakshi
Sakshi News home page

నీళ్ల కోసం రోడ్డెక్కిన మహిళలు

Jun 7 2018 11:30 AM | Updated on Jun 7 2018 11:30 AM

Womens Protest On Road For Water In Prakasam - Sakshi

రోడ్డుపై బైఠాయించిన మహిళలు

ప్రకాశం, పొదిలి:  నీళ్లు లేక పడుతున్న ఇబ్బందులతో మహిళలు సమస్య తీవ్రతను తెలిపేందుకు రోడ్డు ఎక్కారు. బుధవారం  స్థానిక టైలర్స్‌ కాలనీ వాసులు ఒంగోలు రోడ్డులోని దర్గా సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలను ప్రదర్శించారు. నీళ్ల సమస్య గురించి పలు మార్లు విన్నవించినా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు రోడ్డును వీడ బోమని కూర్చున్నారు.  సాగర్‌ నీరు సక్రమంగా  రావడం లేదని తెలిపారు.

ట్యాంకర్ల ద్వారా వస్తున్న నీరు ఏమాత్రం అవసరాలు తీర్చడం లేదని తెలిపారు. పేదలమైన తాము నీరు కొనుగోలు చేసే పరిస్థితి లేదని వాపోయారు.  మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు కొంత మేర  అంతరాయం ఏర్పడింది. ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాసరావు, ఎస్సై నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. నీటి సమస్య వెంటనే పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement