మహిళా సహకార ఆర్థికసంస్థలో అక్రమాల కేసు | Women's co-operative financial institution illegality case | Sakshi
Sakshi News home page

మహిళా సహకార ఆర్థికసంస్థలో అక్రమాల కేసు

Sep 6 2013 2:17 AM | Updated on Sep 15 2018 3:51 PM

రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థలో చోటు చేసుకున్న సుమారు రూ.30 కోట్ల కుంభకోణంలో ఆ సంస్థ ఎండీగా పనిచేసిన ఐఎఫ్‌ఎస్ అధికారి ఎ.కిషన్ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతించింది.

ఐఎఫ్‌ఎస్ కిషన్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థలో చోటు చేసుకున్న సుమారు రూ.30 కోట్ల కుంభకోణంలో ఆ సంస్థ ఎండీగా పనిచేసిన ఐఎఫ్‌ఎస్ అధికారి ఎ.కిషన్ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కిషన్‌పై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ ఉన్నతాధికారులు గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దానికి అనుగుణంగా ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతించింది.
 
 వాస్తవానికి ఒక చెక్ బౌన్స్ కేసులో ఈ ఏడాది మే నెలలో అరెస్టైన కిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అదే నెలలో సస్పెండ్ చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేర కు గత ఏప్రిల్‌లో నమోదైన కేసుకు సంబంధించి ప్రస్తుతం ప్రా సిక్యూషన్‌కు అనుమతించింది. ఐపీసీ సెక్షన్లు 120-బి, 403, 408, 409, 418, 419, 420, 471, 468తో పాటు, ఏపీ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్‌టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) చట్టం 1994, ఏపీ సహకార సంఘాల చట్టం 1964 ప్రకారం చార్జిషీటు దాఖలుకు ప్రభుత్వం అనుమతించింది. మహిళా సహకార సంస్థలో 2006 మార్చి 11వ తేదీ నుంచి 2008 ఫిబ్రవరి 12 వరకూ (కిషన్ ఎండీగా ఉన్నకాలం) నిబంధనలకు విరుద్ధంగా రుణాలిచ్చి నిధులు స్వాహా చేయడం వంటి అక్రమాలపై సీఐడీ చార్జిషీటు దాఖలు చేయనుంది. అటవీశాఖలో జరిగిన అక్రమాలకు సం బంధించి కిషన్‌పై గతంలోనూ 2 కేసులు నమోద య్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement