పిడుగుపడ్డ చోట తగ్గని వేడి... మహిళల పూజలు | Women to devote pujas after thunderbolt earth became heat | Sakshi
Sakshi News home page

పిడుగుపడ్డ చోట తగ్గని వేడి.. మహిళల పూజలు

Jun 4 2015 9:26 PM | Updated on Sep 3 2017 3:13 AM

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం ఎర్రమద్దువారిపల్లె సమీపంలోని గుట్టపై పిడుగుపడిన కారణంగా భూమి చీలి మంటల వచ్చిన ప్రాంతంలో ఇంకా వేడి తగ్గనేలేదు.

బి.కొత్తకోట(చిత్తూరు): చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం ఎర్రమద్దువారిపల్లె సమీపంలోని గుట్టపై పిడుగుపడిన కారణంగా భూమి చీలి మంటల వచ్చిన ప్రాంతంలో ఇంకా వేడి తగ్గనేలేదు. బుధవారం తెల్లవారుజామున గుట్టపైనున్న 33కేవీ విద్యుత్ సరఫరా లైను స్తంభం కింద పిడుగుపడడంతో భూమి చీలి మంటలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ ప్రాంతంలో బుధవారం విద్యుత్ శాఖ అధికారులు రెండు ట్యాంకర్లతో నీరు పోయడంతో మంటలు ఆరిపోయాయి. కానీ, రెండు రోజులవుతున్నా వేడి తగ్గలేదు. విద్యుత్ స్తంభం కింద పడ్డ చోట గురువారం మరో ట్యాంకర్ నీరు పోశారు. నీళ్లు ఇంకిపోతున్నా వేడి తగ్గక పోవడంతో స్థానిక మహిళలు భూమాతా శాంతించు.. అంటూ గురువారం కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement