ఆటోను ఢీకొన్న లారీ: మహిళ మృతి | woman died in a road accident and few passengers injured | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న లారీ: మహిళ మృతి

May 20 2016 8:37 AM | Updated on Apr 7 2019 3:24 PM

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ఓవర్‌బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ఓవర్‌బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగురాళ్ల మండలం పెద్దనంబిపూడి గ్రామం నుంచి పిడుగురాళ్లకు వెళ్తోన్న ప్యాసింజర్ ఆటోను ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాజమ్మ(38) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం వారిని నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement