రైతు రుణాలన్నింటినీ ఈనెల 25వ తేదీలోగా మాఫీ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
రైతు రుణాలన్నింటినీ ఈనెల 25వ తేదీలోగా మాఫీ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలం ఓబనపల్లిలో ఆయన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి గోదావరి నీళ్లను కృష్ణకు, కృష్ణాజలాలను రాయలసీమకు అందిస్తామని ఆయన అన్నారు.
గాలేరు- నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులను పూర్తిచేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ బాధ్యతలను తామే చేపడతామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇన్ ఇండియా అని పిలుపునిచ్చారని, దాన్ని తాను మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఇంటికీ నీళ్లు, గ్యాస్, ఇంటర్నెట్ సదుపాయాలను కల్పిస్తామని ఆయన చెప్పారు.