నీళ్లో రామచంద్రా.. | Water Problem in YSR Kadapa | Sakshi
Sakshi News home page

నీళ్లో రామచంద్రా..

May 16 2019 1:22 PM | Updated on May 16 2019 1:22 PM

Water Problem in YSR Kadapa - Sakshi

చాకిబండ గ్రామంలో తోపుడు బండిపై నీటిని తెచ్చుకుంటున్న గ్రామస్థులు

జనం దాహంతో అల్లాడిపోతున్నారు. తాగునీటికికటకట ఏర్పడింది. మున్నెన్నడూ లేని విధంగా ఈసమస్య తీవ్ర రూపం దాల్చింది. బావులన్నీ ఇంకిపోయాయి.వరుణుడు కరుణించడం లేదు. ఇప్పటికే భూగర్భ
జలాలు పాతాళానికి చేరుకున్నాయి. గతంతో పోల్చితేఈ పరిస్థితి దారుణంగా ఉందని అధికారులే అంగీకరిస్తున్నారు. తాగునీటికి సంబంధించి రోజూ వస్తున్నవిన్నపాలు ఎలా పరిష్కరించాలో అర్ధం కాక అధికారు
లు తల పట్టుకుంటున్నారు.

సాక్షి  కడప : కరువు కరాళ నృత్యం చేస్తోంది..ఎక్కడ చూసినా జిల్లాలో కరువు అందరిని కుంగదీస్తోంది. .ఇప్పటికే ఖరీఫ్, రబీలలో పంట వర్షాభావంతో తుడిచిపెట్టుకుపోవడంతో....దిక్కు తెలియని పరిస్థితి. ఇంకోపక్క కరువు జిల్లాలో సమస్యలతో సతమతమవుతున్నా....ప్రజల సమస్యల పరిష్కారానికి ఆరేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం జిల్లా కేంద్రమైన కలెక్టరేట్‌లో ‘ కరువు సహాయక సెల్‌’ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎవరు చూసినా సమస్యను అధికారుల దృష్టికి తీసుకుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఆరు విబాగాలకు సంబంధించిన అదికారులు ఉన్నా.. కేవలం ఒకట్రెండు శాఖలకు సంబంధించి మాత్రమే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి.

నీటి కోసమే అధికం
జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు..ఎక్కడ చూసినా కరువుతో పల్లెల్లో ఉన్న బోర్లు నిలువునా ఎండిపోవడంతో.. తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడుతోంది. ఆర్‌డబ్లుఎస్‌ అధికారులు నీళ్ళు ట్యాంకర్లతో అందిస్తున్నా.. పూర్తి స్దాయిలో అందిచడం గగనంగా మారింది.అయితే జిల్లాలోని వివిద ప్రాంతాల నుంచి ఎక్కువగా కరువు సెల్‌కు పోన్లు వస్తున్నాయి. తాగునీరు అందలేదు.. అందించండి మహాప్రభో అంటూ జనాలు అధికారులను వేడుకుంటున్నారు. జిల్లాలో తాగునీటి సమస్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీరు మçహాప్రభో అంటూ ప్రజలు కరువు సెల్‌ ద్వారా అభ్యర్ధిస్తున్నారు.. బోరులో నీరు రాలేదని.. లోతు మరింత డ్రిల్‌ చేయాలని....ట్యాంకర్ల ద్వారా నీరు తోలాలని....చెడిపోయిన బోర్లకు మరమ్మతులు చేయాలని....తాగునీటి సమస్య పరష్కరించాలని విపరీతంగా ఫోన్లు చేసి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈనెల ఇటీవల ఒకేరోజు 16 ఫిర్యాదులు కేవలం తాగునీటి కోసమే వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

వ్యవసాయ, పశు సంవర్దక ఉద్యానవన, డ్వామా, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలతోపాటు మున్సిపాలిటీకి సంబంధించిన పలు శాఖల అధికారులను కరువు సెల్‌లో రికార్డు చేయడానికి ఉంచారు.  ప్రస్తుత పరిస్థితుల్లో ఎండలు పెరగడం....భూగర్బ జలాలు ఎక్కడికక్కడ ఇంకిపోవడంతో తాగునీటి సమస్యే ప్రధానంగా మారింది. దీంతో తాగునీటి కోసమే జనాలు కలెక్టరేట్‌లోని కరువు సెల్‌లో విన్నవిస్తున్నారు. జిల్లా కేంద్రమైన కడపలోని కలెక్టరేట్‌లో ఉన్న ఆరు శాఖలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఫోన్ల ద్వారా వచ్చిన  సమస్యలను పుస్తకంలో నమోదు చేస్తున్నారు. ఫలానా గ్రామం నుంచి...ఫలానా సమస్య వచ్చిందని...సంబంధిత శాఖల అధికారులకు తెలియజేయడం ద్వారా పరిష్కారానికి దారి దొరకుతోంది. ఎప్పటికప్పుడు వచ్చిన సమస్యలకు అప్పటికప్పుడు సెల్‌లో ఉన్న శాఖల సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళుతున్నారు.

సుండుపల్లె మండలం మర్రితాడు గ్రామంలో భూగర్బ జలాలు తగ్గిపోయాయి. నీళ్లు రాక అల్లాడిపోతున్నాం. వెంటనే మరిన్ని ట్యాంకర్లతో నీటిని అందించి కాపాడండి.
గాలివీడు మండలం నూలివీడు గ్రామానికి సంబంధించి తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. ట్యాంకర్లతో నీళ్లు తోలుతున్నారు. మరి న్ని ట్యాంకర్లు పెంచి అందించాలని విజ్ఞప్తి చేశారు.
పెండ్లిమర్రి మండలం సోగలపల్లెలో మోటారు కాలిపోయింది. వెంటనే రిపేరు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించండి.
కరువు సెల్‌లో ఉన్న 08562–246344 నెంబ రుకు ఫోన్‌ చేసి బాధితులు సమస్యలు వివరిస్తున్నారు.
ఈనెల 10 నుంచి ఇప్పటివరకు వచ్చిన సమస్యలు దాదాపు 45కు పైగానే వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement